ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 6:27 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రజావాణిలో రాఘవాపూర్‌ సర్పంచ్‌ పై ఫిర్యాదు

పెద్దపల్లి,అర్జున్ సమాచారం:

మండలంలోని రాఘవపూర్‌ గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ పలువురు గ్రామస్థులు విచారణకు డిమాండ్‌ చేశారు. పంచా యతీ నిధులను నిబంధనల కు విరుద్ధంగా మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ బి. శ్రీరాములుకు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామపంచాయ తీకి వివిధ రూపాల్లో వచ్చిన నిధులను నిబంధనల ప్రకారం వినియోగించకుం డా దారిమళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ నిధుల వినియోగంపై సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే సంబంధిత సర్పంచ్‌ తాడిశెట్టి చామంతి, ఉప సర్పంచ్ కొడపత్రి వినోద్, పంచాయితీ కార్యదర్శితో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే పంచాయతీ నిధుల దుర్వినియోగంతో గ్రామ అభివృద్ధికి విఘాతం కలిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని విధుల నుంచి తొలగించడంతోపా టు దుర్వినియోగమైన మొత్తాన్ని పూర్తిగా రికవరీ చేయాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. ఫిర్యాదు పై అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని కుమ్మరి తిరుమల్‌, మోలుమూరి వంశీ, కుమ్మరి సదయ్య, కుమ్మరి నిరంజన్‌, కుమ్మరి సది, శ్రవణ్‌ తెలిపారు.
=========================